అడవి పందుల దాడిలో వరి పంట నష్టం.

Published: Friday April 22, 2022
పొలాలను పరిశీలించిన అధికారులు.
జన్నారం రూరల్, ఏప్రిల్ 21, ప్రజాపాలన: మండలంలోని జన్నారం గ్రామ శివారులలో చెందిన బొడ్డు రామన్న కు చెందిన రెండు ఎకరాలు, పొనకల్ గ్రామానికి చెందిన ముంజం నర్సయ్య కు చెందిన  మరో రెండు ఎకరాలలో అడవిపందులు దాడి చేసి వరి పంటను ద్వంసం చేశాయి. దీంతో బాధితుల పిర్యాదు మేరకు బుదవారం మండల పారెస్టు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుందని, రైతులకు న్యాయం జరిగేలా నష్ట పరిహారం ప్రభుత్వం ఇస్తుందని అదికారులు తెలిపారు. ఐతే బాదిత రైతులు తమ పంట నష్టం పై ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగుచేసుకున్న వరి పంట చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేసి నష్ట పరచడం తమకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.