మేడారం మొక్కులు టి ఎస్ ఆర్ టి సి కార్గో అండ్ పార్సిల్ సమ్మక్క సారలమ్మ బంగారం

Published: Tuesday February 15, 2022
మధిర ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో టి ఎస్ ఆర్ టి సి పార్సెల్ మేడారానికి బంగారం పంపటం జరుగుతుందని టిఎస్ ఆర్టిసి కార్గో పార్సెల్ సర్వీస్ వారు తెలుపుతూ తో సోమవారంనాడు రామాలయం చైర్మన్  మధిర మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ దొడ్డా మురళి బంగారం మొక్కు పంపించినారు తెలిపారు. ఈ సందర్బంగా శ్రీ మురళి మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్స్ ద్వారా ఇటువంటి అవకాశం కల్పించడం జాతరకు వెళ్లలేని భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, మధిర పరిసర ప్రాంత భక్తులు ఈ సదావకాశం వినియోగించుకోవాలని, భక్తుల మొక్కులు తీర్చుకొనే అవకాశం కల్పించిన టి ఎస్ ఆర్ టి సి వారికి కూడా ఆ అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.