వాసవీ క్లబ్ కుటుంబాలను ఆదుకునేందుకే సురక్షా పథకం

Published: Saturday October 09, 2021
వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ కలికోట శ్రీనివాస్...
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్08, ప్రజాపాలన : అంతర్జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాసవీక్లబ్ సభ్యుల మరణానంతరం వారి కుటుంభసభ్యులను ఆదుకునేందుకే వాసవీ కుటుంబ సురక్షా పథకంను ఏర్పాటు చేయడం జరిగిందని వాసవీక్షబ్ జిల్లా గవర్నర్ కలికోట శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల వాసవీక్లబ్ ఆధ్వర్యంలో గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా ఇటీవల కరోనా మహమ్మారి వల్ల మృతిచెందిన వాసవీక్లబ్ సభ్యుడు ద్రాక్షపల్లి కోటయ్య కుటుంబ సభ్యులను గవర్నర్, వాసవీక్లబ్ అంతర్జాతీయ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వాసవీక్లబ్ వికెఎస్పి పథకం ద్వారా వచ్చిన ఆరు లక్షల రూపాయల చెక్కును కోటయ్య సతీమణి ద్రాక్షపల్లి వెంకటలక్ష్మి, కుమారుడు విజయ్ కుమార్లకు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కలికోట శ్రీనివాస్, అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం రాజేశ్, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కటకం హరీష్, అంతర్జాతీయ డైరెక్టర్ ఎకిరాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ, వాసవీక్లబ్ లో చేరిన ప్రతీ సభ్యుడు వాసవీ కుటుంబ సురక్షా పథకంలో సభ్యులుగా చేరాలని కోరారు. ఈ పథకంలో చేరిన సభ్యుల ఖాతా నుండి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ సభ్యుడు మరణించినా వంద రూపాయల చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించడం జరుగుందని అన్నారు. ఇందులో భాగంగానే మంచిర్యాలలోని ద్రాక్షపల్లి కోటయ్య కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు చేయూతను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్ వికె.ఎ.పి జిల్లా ఇంచార్జి అప్పాల శ్రీధర్, జిల్లా క్యాబినెట్ సెక్రటర్ ఇల్లందుల కిశోర్, జోన్ చైర్మన్ పుల్లూరి బాలమోహన్, కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, జోన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు కాచం సతీష్, కార్యదర్శి కేశెట్టి వంశీకృష్ణ, సభ్యులు ఎర్రం వెంకటేష్, కేశెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు.