తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది వీఆర్ఏలకు నిత్యవసర సరుకులు పంపిణీ

Published: Thursday October 06, 2022
బోనకల్, అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి:
మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న 33 మంది రెవెన్యూ గ్రామ సహాయకులకు సంఘీభావంగా మంగళవారం మండల తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది సుమారు 50 వేల రూపాయలు వ్యయంతో బియ్యం, నిత్యవసర సరుకులు తాసిల్దార్ రావూరి రాధిక చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రావూరి రాధిక, డిప్యూటీ తాసిల్దార్, ఆర్ ఐ గుగులోతు లక్ష్మణ్, టైపిస్ట్, ఆళ్ళపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.