ఆరోగ్యకర సమాజంతోనే నేరాల తగ్గుదల

Published: Monday June 27, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):
సమాజం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. పద్మావతి అన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ అభ్యుజుడ్ డే సందర్బంగా మెట్ పల్లి కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాధకద్రవ్యాల వాడకం రోజురోజుకు పెరిగిపోవడం బాధాకరం అన్నారు. ముఖ్యంగా ఈనాటి పిల్లలు, యువత మాధకద్రవ్యాల కు వ్యసనం కావడంతో సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.  నేటి సమాజం నుండి ఈ వ్యసనాన్ని తొలగించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు కూడా కృషి చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 74 క్రిమినల్ కేసులు, 474 ఎస్టీసి కేసుల్ని రాజీ మార్గంలో పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది ఆకుల సురక్ష, న్యాయవాదులు రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, బద్దం లక్ష్మ రెడ్డి, ఒజ్జెల శ్రీనివాస్, బక్కురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.