వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Tuesday November 15, 2022

 

బెల్లంపల్లి నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి:   ప్రభుత్వపరంగా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి, ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం  ప్రారంభించారు.
నియోజకవర్గంలోని నెన్నెల  మండలం చిత్తాపూర్, గంగారం, గుండ్ల సోమారం, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి, దళారీల బారిన పడకుండా, ప్రభుత్వమే రైతుల వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు దళారీల బారిన పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి-ప్రతాప్ రెడ్డి , జడ్పీటీసీ శ్యామల-రాంచందర్, స్థానిక సర్పంచ్ లు పద్మ , సుధ , ఎంపీటీసీ కమల, సహకార సంఘం చైర్మన్ మల్లేష్ , వైస్ చైర్మన్ శ్రీనివాస్ , రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్ , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు,  పాల్గొన్నారు .బెల్లంపల్లి నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి:   ప్రభుత్వపరంగా, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి, ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం  ప్రారంభించారు.