ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నళిని రెడ్డి

Published: Saturday August 27, 2022
మేడిపల్లి, ఆగస్టు26 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన హబ్సిగూడ డివిజన్ కు చెందిన నళిని రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
 ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  నివాసంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమక్షంలో హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బి.వీ. చారి ఆధ్వర్యంలో నళిని రెడ్డి మరియు కొంతమంది మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి   ఆహ్వానించారు. ఈ  కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్, మేకల ముత్యం రెడ్డి,కంచర్ల సోమిరెడ్డి, లక్ష్మీనారాయణ, రవి నాయక్, లింగ నాయక్ ,దాసరి కర్ణ, మహిళలు అనిత రెడ్డి ,భాగ్యలక్ష్మి , ధనలక్ష్మి, రాజ్యలక్ష్మి, వాణి ,నిర్మల, ప్రభావతి, నజ్రిన్, అనిత ,ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area