హరిహర అఖండ క్షేత్రం లో 104 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణానికి మహాసంకల్పం

Published: Wednesday August 25, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం హరివర అఖండ క్షేత్రం ఆధ్వర్యంలో 104 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మహాసంకల్ప కార్యక్రమం  కొండ పైన కొలువున్న ఆంజనేయ స్వామి ఆవరణలో మంగళవారం మహాసంకల్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరపట్నం పరిసర ప్రాంతాలు సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కేంద్రంగా 104 గ్రామాల ప్రజల సహకారంతో 104 అడుగుల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ సంకల్ప కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ జాగరణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , రాష్ట్రాల ప్రచారక్  అమర లింగన్న మరియు సదా వెంకట్ రెడ్డి హాజరై మార్గదర్శనం చేశారు. ధర్మ జాగరణ మూడు రాష్ట్రాల ఇంచార్జ్ అమర లింగన్న మాట్లాడుతూ భక్తి ఆధారంగా వ్యక్తి వికాసం జరుగుతుందని గుడి ఆధారంగా కార్యక్రమాలు జరిగేవని అన్నారు. ఈ ప్రపంచానికి జ్ఞాన భిక్ష ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని అందించిన దేశం మన దేశం అని అన్నారు. రాజగోపాల్ నాయుడు హనుమాన్ బృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. భగవంతరావు మళ్లీ రంగారెడ్డి జిల్లా మహిపాల్ మహేందర్ రెడ్డి కప్పరి స్రవంతి చందు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, నరాల విశాల విద్యాసాగర్, ఆకుల మమత నందు, నంద రెడ్డి, గురు నాథ్ రెడ్డి, కళ్యాణ వనవాసి సమితి శివాజీ రావు, కార్యక్రమ వీర పట్నం అఖండ ట్రస్ట్ వ్యవస్థాపకులు సదా వెంకట్ రెడ్డి,  ప్రస్తుత ట్రస్టు సభ్యులు భగ్గవరపు రమేష్, కాకి శ్రీనివాస్, శ్రీశైలం, చంద్రశేఖర్, రామిడి వెంకట్ రెడ్డి అఖండ ఐదు మండలాల సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.