ఆకతాయిలు ఆరు బయట మద్యం సేవించడం వల్ల గేదెలకు గాయాలు

Published: Wednesday January 18, 2023

జన్నారం జనవరి 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఆకతాయిలు ఆరుబయట మద్యం సేవించడం వల్ల కాళీ సీసాలు గుచ్చుకొని గేదెలకు తీవ్రంగా గాయాలు అవుతున్నాయి. ఆవులు గేదెలకి ఆకతాయిలు బయటి ప్రాంతాలలో బాటిల్స్ కాళీ సీసాలు తాగి విచ్చలవిడిగా పాడేయడం ద్వారా జంతువులకు గుచ్చుకొని నానా అవస్థలకు గురవుతున్నాయి. మండలంలోని గేదెలను పోషిస్తున్న యజమానులకు  గేదెలకి సీసా వక్కలు కుచ్చుకోవడం వాటి వైద్యానికి చాలా డబ్బులు ఖర్చవుతునయాన్నారు. మండల గ్రామాల్లోని గేదెలను చూస్తే ఇబ్బందికరంగా ఉందన్నారు. యజమానులు గేదెల గాయాలు వల్ల చాలా బాధగా ఉన్నారు. వెంటనే స్థానికంగా ఉన్న  అధికారులు స్పందించి ఆకతాయిలు తాగేటువంటి మద్యాన్ని సిట్టింగ్ రూములలో తాగే విధంగా ఏర్పాటు చేసినప్పటికీ, బయట మద్యం సేవిస్తే స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు జన్నారం మండల గ్రామ జంతు పోషణ యజమానులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువుల డాక్టర్లు, మామిడి విజయ్, కిరణ్, మహేష్, హరి, సుభాష్, పాల్గొన్నారు.