జాతీయ ఫైలేరియా మరియు నులిపురుగుల ఉచిత నివారణ మాత్రలు పంపిణీ

Published: Friday July 16, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమానికి డాక్టర్ పాపారావు, జిల్లా కుష్టు మరియు టీబీ నివారణ అధికారి యాదాద్రి భువనగిరి జిల్లా మరియు సర్పంచ్ బోల్ల లలిత శ్రీనివాస్,జాతీయ ఫైలేరియా నులిపురుగుల మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. బోధ వ్యాధి నిర్మూలనకు మరియు నులి పురుగుల నివారణకు ఈ మాత్రలు ప్రజలందరూ వేసుకోవలసిందిగా తెలిపినారు. బోధ వ్యాధి రాకుండా మరియు నులి పురుగులు రాకుండా ఉండేందుకు ఈ మాత్రలు పనిచేస్తాయని తెలిపినారు. ఈ కార్యక్రమము నేటి నుండి మూడు రోజుల వరకు ఉంటుందని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ మరియు వాలంటరీ లు, మీ ఇంటికి వచ్చి ఈ మాత్రలు మింగీయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లో డాక్టర్ సుమన్ కళ్యాణ్, సుమలత, డాక్టర్ జ్యోతి, వర సునంద, డి పి హెచ్ ఎన్. సంతోష్ కుమార్, ఏ పిఎం ఓ సువర్ణ కుమారి, సూపర్వైజర్ అనురాధ,సూపర్వైజర్ శౌరి, హెల్త్ శ్రీలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ టి ఎస్ ప్రీతం బాబు, ల్యాబ్ టెక్నీషియన్, ఆశా కార్యకర్తలు గీతా, జ్యోతి, సబిత, సత్యవతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.