ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించాలి. కెవిపిఎస్ డిమాండ్

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.
ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల్లో. ఎస్సీ ఎస్టీలకు కటాఫ్ మార్క్స్ 60 నుండి 40 కి తగ్గించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు సామెల్ కార్యదర్శి ప్రకాష్ కారత్ మాట్లాడుతూ.. ఓసీలకు 80 మార్కుల నుండి 60కి. బీసీలకు 70 మార్కుల నుండి 60కి కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం.. ఎస్సీలకు మాత్రం 60కి 60 ఉంచడాన్ని బట్టి ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని అన్నారు. దీనివలన రిజర్వేషన్ కోల్పోయి దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోయే అవకాశం ఉందని. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే కటాఫ్ మార్కుల్ని 60 నుండి 40 కి తగ్గించాలని. రిజర్వేషన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎచరించరు ఈ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు చెన్నయ్య మనోహర్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ విజయ పెద్దయ్య గిరి జ్యోతిబాసు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ పి ఎన్ ఎం జిల్లా కార్యదర్శి గణేష్  తదితరులు పాల్గొన్నారు.