కాంగ్రెస్ నేతలందరూ ఒకరోజు సత్యాగ్రహ దీక్ష

Published: Tuesday June 08, 2021
బాలపూర్, జూన్ 07, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి వైరస్ ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లెల గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్షను కాంగ్రెస్ పార్టీ అధినేత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశానుసారంగా పి సి సి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపుమేరకు రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీపీఎల్ కుటుంబలన్నింటికి కరోనా, బ్లాక్ ఫంగస్ లకు ఉచిత చికిత్స కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ సోమవారం నాడు ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకు సత్యాగ్రహ దీక్ష ను చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..... కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల ను ఆరోగ్య శ్రీ లో చేర్చి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనా మహమ్మారి వైరస్ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.... బడుగు బలహీన వర్గాలకు ఎగువ దిగువ మధ్యతరగతి ప్రజానీకానికి కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధుల నుండి ప్రజలందరూ విముక్తి కై  ఉచిత వైద్యాన్ని అందించాలని అన్నారు. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గం వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఫ్లోర్ లీడర్ మాజీ జడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, కందుకూరు బొక్క భూపాల్ రెడ్డి, మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ చల్లా బాల్ రెడ్డి, షాద్నగర్ ఎంపిటిసి శ్రీశైలం, డిసిసి కార్యదర్శి దేవా గోనికృష్ణ, బండి మధుసూదన్ రావు, నల్లమిల్లి ధన్ రాజ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కిసాన్ సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కావలి శ్రీశైలం, జిల్లేడు మండల అధ్యక్షులు చౌదర్ గుడా కావాలి రాజు, ఎక్స్ ఎం పి టి సి షాద్నగర్ తుపాకుల శేఖర్, విద్యాల మాజీ సర్పంచ్ నెహ్రూ, లింగా రెడ్డి గూడెం సర్పంచ్ అశోక్ నవీన్, కాంగ్రెస్ కార్యకర్తలు తిమ్మాపూర్ గెల సుభాష్ రెడ్డి, కర్మాంఘాట్ గోవర్ధన్ రావు, జిల్లెలగూడ మాజీ ఎంపిటిసి నిమ్మల వెంకటేష్ గౌడ్, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.