కోరుట్లలోని మునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రవి

Published: Tuesday July 19, 2022

కోరుట్ల, జూలై 18 ( ప్రజాపాలన ప్రతినిధి ):
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంతో  మునిగిన కోరుట్లలోని 10,11 వార్డులను సందర్శించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, జరిగిన నష్టాలను కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించి,చేయవలసిన మరమ్మతు చేర్యలను ఇక ముందు కాలంలో ఇలాంటి వరదలు వస్తే వార్డులు నీట మునగకుండా నష్టాలు జరగకుండా భారీ కల్వర్టును నాళాలను నిర్మించి వరద నీటిని మళ్లించే విధంగా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని,అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  వారితో పాటు డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో వినోద్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్, మున్సిపల్ కమిషనర్ అయాజ్, ఎమ్మార్వో రాజేష్, డి ఈ అభినయ్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, సంగ లింగం,మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area