మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి **

Published: Wednesday December 14, 2022
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్ **
 
కార్మికులకు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం మునిసిపల్ కార్మికులను మోసం చేసిందన్నారు. 11వ పిఆర్సి, బిస్వాల్ కమిటీ  సూచించిన వేతనం రూ 19,500, ల వేతనాన్ని కాదని,15,600,లుగా నిర్ణయించి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని, అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లేకుండా  పర్మినెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు గాలిలో కలిసిపోయాయన్నారు. ఏపీలో ఇచ్చినట్లుగా మన రాష్ట్రంలోని కార్మికులకు అందరికీ రూ21 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపాలిటీలో అనేకమంది కార్మికులు దళితులు ఎస్సీలు ఉన్నారని అర్హులైన అందరికీ దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటి స్థలం ఉన్నవారికి రూ 5 లక్షలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లకై కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శంకర్, సంజు, శంకరమ్మ మల్లేష్ రమేష్, స్వామి రాజన్న అంజయ్య తదితరులు కార్మికులు పాల్గొన్నారు.