ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పిఎసిఎస్ ఛైర్మన్

Published: Tuesday April 20, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిదిలోని సంఘం, చైతన్యపురి, పొద్దుటూరు, ఎదుల్లగూడెం, పహిల్వాన్ పురం, పులిగిల్ల, సుంకిశాల, కెర్చిపల్లి, దాసి రెడ్డిగూడెం, గోల్లేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వరి పండించే రైతులు దలారీలను నమ్మి మోసపోవద్దని కరోనా మరోసారి విజృంభిస్తున్న మద్దతు ధర ప్రకటించి సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. రైతులు తేమ, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన ధర A గ్రేడ్ రకం రూ 1888/- B గ్రేడ్ రకం రూ 1868/- ని పొందాలని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఫైళ్ల వీరారెడ్డి, కొమురెల్లి సంజీవరెడ్డి, సర్పంచులు మొగిలి పాక నరసింహ, ఎంపీటీసీలు బండారి ఎల్లయ్య, గ్రామస్తులు, ఫైళ్ల మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.