ముదిరాజుల హక్కులను సాధించుకుందాం

Published: Monday October 11, 2021
ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 10 అక్టోబర్ ప్రజాపాలన : ముదిరాజుల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు నడుంబిగించాలని వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి గ్రామంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు కల్ఖోడ నర్సిములు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజుల జెండా కార్యక్రమంతో పాటు జైదుపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ..అనాదిగా మత్స్యకార వృత్తి చేపడుతూ ముదిరాజులు జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. పేరులోనే రాజరికం ఉండి గరిష్ఠ కుటుంబాలు కడుపేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బిసి డి గ్రూపు నుండి బిసి ఎ గ్రూపులోకి మార్చడం అందని ద్రాక్షగా మిగిలిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జైదుపల్లి ముదిరాజ్ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా జి.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా పి.సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బాల్ నర్సిములు, కిష్టయ్య, పెద్ద వెంకటయ్య, కార్యదర్శులుగా జి.శ్రీనివాస్, యు.సత్యయ్య, కోశాధికారిగా, జి.గోపాల్, కార్యవర్గ సభ్యులుగా జి.భాను, జి.పాండు, పి.సురేష్, పి.వెంకట్, పి.చిన్నవెంకటయ్య, పి.పర్మయ్య, జి.జంగయ్య, జి.అనిల్, ముఖ్య సలహాదారులుగా జి.ఈశ్వర్, జి.నారాయణ, జి.బిచ్చయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు గొర్రెంక వెంకటయ్య, వికారాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బిఆర్ శేఖర్, దుద్యాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.