అభివృద్ధికి ఆటంకాల పరిష్కారం కోరుతూ తహశీల్దార్ కు యూత్ వినతిపత్రం

Published: Saturday March 13, 2021
గొల్లపల్లి, మార్చి12 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపెల్లి మండల కేంద్రంలో ఏళ్ళ తరబడి పెండింగులో ఉన్న ప్రధాన సమస్యలను తహశీల్దార్ కు విన్నవిస్తూ గొల్లపల్లి నల్లగుట్ట పరిధిలో సుమారు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నారు వీరిలో వృద్ధులు వికలాంగులు ఉన్నారు వీరికి రేషన్ సరుకులు తెచ్చుకోవడం రెండు కిలోమీటర్ల దూరం బారమై చాలా ఇబ్బంది పడుతున్నారు కావున నూతన రేషన్ షాప్ఏర్పాటు కోరుతూ, మండల యవతకు  ప్రజలకు వాకింగ్ వ్యాయామ క్రీడల సౌకర్యార్థం 2014 రాజివ్ ఖేల్ అభియాన్ మినీ క్రీడామైదానం స్థలము కేటాయించిన ప్రభుత్వ భూమి సర్వే నెం735 లోని ఏడు ఎకరాల స్థలం సమస్య పరిష్కారిస్తూ క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని, ప్రాంత ప్రజల త్రాగునీటి కొరకు శుద్ధజల యంత్రం ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేసి సామాన్య ప్రజల దాహార్తి తీర్చాలని కోరుతూ ట్రూ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ సభ్యులు ప్రజల తరుపున సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారూ. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు ఇడగోటి సురేందర్ గంగాధర మధుసూదన్ ఎరవేని రాహుల్ గంగుల సాయి చరణ్ ఎనగందుల మహేష్ నేరేళ్ల మహేష్ శివరాత్రి శరత్ ఎనగందుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.