రైస్ మిల్లర్లకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday July 27, 2022
మంచిర్యాల బ్యూరో,  జూలై 26,
 ప్రజాపాలన :
 
రైన్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయం లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైన్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వరిసాగుకు అనుగుణంగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని తెలిపారు., రోజువారిగా కనీసం 8 వేల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, రైని మిల్లుల సామర్థ్యం, పరిస్థితిని బట్టి యూనియన్లు వారికి తగు లక్ష్యాలను కేటాయించాలని తెలిపారు. ఉపయోగకరంగా ఉన్న గన్నీ సంచులను వినియోగిస్తూ అవసరమైన మేరకు నూతన గన్నీ సంచుల కొరకు తగు ప్రతిపాదనలు తయారు చేసి అందించాలని తెలిపారు. జిల్లాలో 89 రైన్ మిల్లులు ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రైని మిల్లులలో వరదనీరు చేరిందని, వరద కారణంగా దెబ్బతిన్న రైస్ మిల్లుల వివరాలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమకుమార్, రైన్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు నల్మాను కాంతయ్య, రైన్ మిల్లర్లు నంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.