రెచ్చిపోతున్న కేటుగాళ్లు

Published: Tuesday February 15, 2022

ఇబ్రహింపట్నం ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తేది.22/01/2022 రోజున తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గోళీ నర్సింహా తన గ్రామములో గృహ నిర్మాణం చేసుకుంటుండగా ఉదయం సమయంలో ఎవరో ఇద్దరు వ్యక్తులు నర్సింహాను సంప్రదించి తమకు బాలాపూర్ లో సిమెంట్ షాప్ ఉన్నదని తక్కువ రెట్లకే సిమెంట్ సరఫరా చేస్తామని నమ్మించి అతని వద్ద ఫోన్ పే రూపములో డి డి తీసి సిమెంట్ పంపుతామని అందుకు అతని వద్ద 17400/- ఫోన్ పే చేపించుకొని అట్టి ఫోన్ పే నంబర్ తీసివేసి తప్పించు కొని తిరుగుతుండగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించన యాచారం పోలీస్ లు టవర్ లొకేషన్ ఆదరంగా ఆటివారు అయినా A1:వరికుప్పల. నరేష్, వయసు. 26 సంవత్సరాలు మరియు A2:వరికుప్పల శ్రీనివాస్,24 సంవత్సరాలు ఇద్దరు మన్నెగూడ H/o నేదునూరు గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా వారీగా గుర్తించి వారిని విచారించాగా వారు తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహా వద్దకు వెళ్లి మోసం చేసి అతనితో డీల్ కుదుర్చుకొని ఆఫీస్ దగ్గరకు వెళ్ళాక ఫోన్ చేస్తాము డబ్బులు పంపించిగానే సిమెంట్ లోడ్ పంపుతామని చెప్పి నమ్మించి అక్కడ నుండి ఇద్దరు చింతపల్లి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి అక్కడ బంకులోని క్యాషియర్ తో తమకు తమ సోదరుడు డబ్బులు పంపుతాడు మాకు గూగుల్ పే ఫోన్ పే లేదని అబద్దం చెప్పి అతని ఫోన్ పే కు డబ్బులు వేయుంచుకున్నారు అని వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు అట్టి వారిని తేది:14/02/2022 రోజున యాచారం సిఐ లింగయ్య  ఆదేశాల మేరకు దర్యాప్తు అధికాని వి.ప్రసాద్ యస్ ఐ ఆఫ్ పోలీస్ మరియు వారి సిబ్బంది అదుపులోకి తీసుకోని  రిమాండ్ కు తరలించారని వారు తెలిపారు.