ధరఖాస్తు చెసుకున్న ప్రతి ఒక్కరికి హస్టల్ లో వసతి కల్పించాలి.

Published: Friday February 05, 2021

ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా  మాస్కులు,శానిటైజర్ అందించాలి.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఓ కు  ఎస్ఎఫ్ఐ  వినతి.


మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన.

ప్రభుత్వ వసతి గృహాల్లో అడ్మిషన్ల కోసం ధరఖాస్తు చెసుకున్న  ప్రతి ఒక్కరికి  వసతి కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన  కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎఒ కు  పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహామ్మారి నేపథ్యంలో ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా  మాస్కులు,శానిటైజర్ అందించాలని కోరారు.  ఫిబ్రవరి 1 నుండి కరోన నిబంధనలు పాటిస్తు ప్రారంభమైన ప్రభుత్వ విద్యసంస్థల్లో  విద్యార్థులకు కనిసం మాస్కులు , శానిటైజర్ ప్రభుత్వం పూర్తిగా అందించడం లెదని పేర్కొన్నారు. మాస్కు లెకపోతె పాఠశాలకు రావద్దు అంటు చెప్తున్నారని తెలిపారు. మరో వైపు చాలా మంది విద్యార్థులు హస్టల్ సౌకర్యం ఉందని కళాశాలలో చేరితే, ప్రస్తుతం అధికారులు మాత్రం కోందరికె అనుమతులు ఉన్నాయంటున్నారని గుర్తుచేశారు. దింతో దూర ప్రాంతాల నుండి వచ్చె విద్యార్థులు అయోమయా స్థితిలో ఉన్నారని వివరించారు.
జిల్లాలో ఉన్నటువంటి  సంక్షెమ హస్టళ్ళలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  స్థానిక వార్డెన్లు కనిస సౌకర్యాలు అయిన త్రాగునీరు,మూత్రశాలలు,మరుగుదోడ్లు , విద్యుత్,ఫర్నిచర్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదే విధంగా  ప్రభుత్వ పాఠశాలల్లో పనిచెసే పార్ట్ టైం వర్కర్స్ ప్రస్తుతం లెకపోవడంతో పాఠశాలలను,బాత్రూంలను శుభ్రం చెయడానికి ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోంటున్న రని  జిల్లా కలెక్టర్  స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలనిడిమాండ్ చేశారు. లెని యేడల అందోళన కార్యక్రమాలు చెస్తామాని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు
వినోద్,లవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.