జోగన్ పల్లి లో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భగా ఘన నివాళులు

Published: Tuesday November 30, 2021
కోరుట్ల, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామం లో ఆదివారం రోజున జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి సందర్భంగా పులే చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాజిక సాంఘిక విప్లవకారుడు, తన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి, బడుగుల కోసం పాఠశాల ప్రారంభించి, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని తెలిపిన మహనీయుడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగా భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే 131  వర్ధంతి సందర్భంగా ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు తెలిపారు. చిన్న వయసు నుండి జ్యోతిరావు పూలే కు పుస్తక పఠనం అంటే ఆసక్తి ఎక్కువ పూలే బాల్యంలోనే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారు. 13 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు పూలేకు 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. పూలే 18 ఆగస్టు నెలలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. పాఠశాలలో అన్ని కులాల వారికి ప్రవేశం కృతజ్ఞలతో బోధించడానికి ఉపాధ్యాయులు ఎవరు ముందుకు రాలేదు. చివరకు  అతని భార్య సావిత్రి పిల్లలకు పాఠాలు బోధించారు. పూలే ఆ కాలంలో వితంతు పునర్వివాహాలు గురించి ఎంతో చైతన్యం తీసుకువచ్చారు. పూలే కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడాడు.1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి ఇ దిగువ కులాల ప్రజలకు సమాన హక్కుల పోరాటానికి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు. సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేసిన జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉప సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, ఏఏంసీ డైరెక్టర్ ఎల్పుల అంబేడ్కర్, ప్రభుత్వ ఉపాద్యాయులు శివ రాములు, మెండే అంజయ్య, పోతవేని రాజేశం, ముత్యపు రాజశేఖర్, జుపతి నరేందర్, ఇంద్రాల హరీష్, ఇంద్రాల అశోక్, పోతుగంటి గణేష్, శ్రీకాంత్, నవీన్, గంగాధర్, సతీష్, వెంకటేష్ తదిదరులు పాల్గొన్నారు.