మండల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించండి : వైద్యాధికారి శ్రీకాంత్

Published: Friday July 15, 2022
బోనకల్, జులై 15 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ఇళ్లలో వారు మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. వేడి ఆహార పదార్థాలను తీసుకోవడంతోపాటు కాచి చల్లార్చిన గోరువెచ్చటి నీటిని త్రాగాలని, తినే ఆహార పదార్థాలలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో దోమ కాటు వలన డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దోమల నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న, ప్రభుత్వ వైద్యశాలకు రావాలని, ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు మందులు అందుబాటులో ఉన్నాయని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.