ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన మంత్రులు ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Saturday June 18, 2022
మేడిపల్లి, జూన్17 (ప్రజాపాలన ప్రతినిధి)

హబ్సిగూడ డివిజన్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో  జెమినీ ఎడిబుల్ ఆయిల్ ప్యాట్ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో 85 లక్షల అంచనా వ్యయంతో 6 అదనపు తరగతి గదులు నిర్మాణా కొరకు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మాణమైన అదనపు తరగతి గదులను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి  కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేేేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కక్కిరేణిి చేతన హరీష్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్ ప్యాట్ ఇండియా లిమిటెడ్ ఎండి ప్రదీప్ చౌదరి ,వైస్ ప్రెసిడెంట్లు చంద్రశేఖర్ రెడ్డి,  అక్షయ్ చౌదరి ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్ , డీఈఓ  విజయ కుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి ,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు , కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.