భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది

Published: Friday July 01, 2022
ఈ కార్యక్రమంలో  ఏర్పుల తరంగ్ మాట్లాడుతూ   విద్యాసంస్థలు ప్రారంభమై నేటికీ పదిహేను రోజులు గడుస్తున్నా ఇంకా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందకపోవడం బాధాకరం  ప్రభుత్వానికి విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ప్రభుత్వ పాఠశాలలో  టీచర్  పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోని స్థాయిలో ఉంది.. మేము ఎస్ఎఫ్ఐ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి అలాగే ఎక్కడెక్కడ అయితే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి బోడ వంశీ, వినయ్ వర్షిత్ మింటూ శ్రావణ్ పాల్గొన్నారు.