స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published: Tuesday April 04, 2023

జన్నారం, ఏప్రిల్ 04, ప్రజాపాలన: స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు ఇల్లందుల కృష్ణమాచారి కోరారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ స్వర్ణ కార కార్పెంటర్స్ నూ అన్ని విధాలుగా ఆదు కోవాలని రాష్ట్రములొ విశ్వబ్రాహ్మను లకు పనులు లేక ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతూనరన్నారు. కార్పొరేట్ జూవెలర్ వల్ల స్వర్ణకారులు అటవీ శాఖ దాడుల వల్లకార్పెంటర్స్ బతుకు భారమై ఆత్మ హత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రములొ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000వేల కోట్లు ఏర్పటు చేసి బ్యాంకు ద్వారా రుణాలు ఆధునిక పనిముట్లు ఉచిత ముగా ఇవ్వాలని 50 సం,లు నిండిన విశ్వబ్రానులకు 3000 రూపాయలు పెన్షన్ ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ మాలిదశ ఉద్యమంలొ అసువులు బాసిన కాసోజు శ్రీకాంత చారి జయంతులు వర్ధంతులు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, ప్రభుత్వన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల స్వర్ణకార సంఘ అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్, కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్, కోశాధికారి ముమ్మడి రమేష్, ఉపాధ్యక్షులు, వై సత్యం తునికి బుమయ్య , వేగ్యారపు ఆనందం, రాము, సాయి, తదితరులు పాల్గొన్నారు.