ఉప్పల్లో ఆగస్ట్ 8న బోనాల పండుగ

Published: Tuesday August 03, 2021
మేడిపల్లి, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్లో పోచమ్మ, మహంకాళి బోనాల తేదీలను గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈనెల 8న పోచమ్మ, 12న మహంకాళి బోనాల తేదీలను ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు ప్రకటించారు. అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మందుముల పరమేశ్వర్ రెడ్డి, పోగుల దయాకర్ రెడ్డి, బిక్కుమళ్ల అంజయ్య గుప్తా మరియు పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు బోరంపేట కృష్ణ, ఈగ ఆంజనేయులు, పోగుల ఏల్లా రెడ్డి, సోము జంగయ్య, భాస్కర్, గొరిగా ఐలయ్య, బతిని యాదగిరి, శగా శేఖర్, ఏర శీను, బిక్కుమళ్ల అశోక్ గుప్తా, ఉప్పల్లోని పోచమ్మ ఆలయాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించారు. ఆలయం వద్ద కల్పించాల్సిన సౌకర్యాల గురించి ఈఈ నాగేందర్, ఏఈ వసంత తో చర్చించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాకారం లక్ష్మణ్, శేఖర్ రెడ్డి, మంద మురళి కృష్ణ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, జీతు, నరేష్ తదితరులు పాల్గొన్నారు