పోషణ పక్వాడా - పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించిన: అంగన్వాడి టీచర్ వడ్లమూడి నాగమణి

Published: Wednesday March 24, 2021
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 22 ఖమ్మం జిల్లా:- నేలకొండపల్లి మండలం మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం గురుకుల పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ వి.నాగమణి మాట్లాడుతూ పోషణ, పెరటి తోటలు గురించి, మరియు పోషణ లోపం, ఆహార వైవిద్యత, తల్లిపాల ప్రాముఖ్యత అనుబంధ పోషకాహారం, పారిశుధ్యం పరిశుభ్రత పద్ధతులు,  సమతుల్య ఆహారం గురించి వివరించడంజరిగింది.  విద్యార్థులకు హ్యాండ్ వాష్, పోషణ పక్షం, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారు మొదటి బహుమతి: బి.మానస, రెండో బహుమతి: యం. యమునా, మూడవ బహుమతి : ఇందుశ్రీ  గెలుపొందడం జరిగింది.  అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కందాల లిల్లీ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఈవూరి ప్రమీల, టీచర్ వుసికల శైలజ, హెల్త్ మేడం. బి. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.