విదేశీ విద్య స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవాలి

Published: Friday January 06, 2023
 జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారిణి సుధారాణి
వికారాబాద్ బ్యూరో 05 జనవరి ప్రజాపాలన : రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాల వారు విదేశాల్లో చదువుల నిమిత్తం సిఎం ఓవర్శిస్ స్క్లాలర్శిప్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని 
జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారిణి సుధారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ స్టడీస్ కొరకు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలలో చదువుకొనుటకు అర్హత గల అభ్యర్తులు దరకాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి అన్నారు. ఆగస్ట్ 2022 నుండి డిసెంబర్ 2022 కాలంలో ఫాల్ సీజన్ అడ్మిషన్ తీసుకున్న అభ్యర్తులు తమ ధ్రువ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లి తండ్రుల వార్షిక  ఆదాయం  రూ. 5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థికి స్కాలర్షిప్ రూ.20 లక్షలు రెండు విడుతలలో చెల్లిస్తారని స్పష్టం చేశారు. విమాన ప్రయాణ చార్జీలు రూ.60 వేలు ఇస్తారని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23 వరకు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరములకు జిల్లా మైనార్టీల సంక్షేమ అధికారి కార్యాలయంలో  సంప్రదించాలని పేర్కొన్నారు.