ఆర్ టీ సి బస్సులకోసం విద్యార్థులు ఎస్ ఫ్ ఐ ఆధ్వర్యంలో ధర్నా

Published: Saturday November 19, 2022

-కళాశాల పాఠశాలల  సమయాలలో  బస్సులు నడపాలి.


-అర్బన్ బస్సులలో విద్యార్థులకు బస్సు    పాసులు అనుమతించాలి.

చేవెళ్ల నవంబర్ 18 (ప్రజాపాలన):-


చేవెళ్ల మండల కేంద్రంలో విద్యార్థులు
బస్సుల సకాలంలో  నడపాలని ఎస్ ఫ్ ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ధర్నా  చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య కనుగుణంగా కళాశాలలు పాఠశాలల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున బస్సు చార్జీలు పెంచిన విద్యార్థులు పాసులు తీసుకున్న సబర్బన్ బస్సులలో అనుమతించకపోవడం దుర్మార్గమని అన్నారు మైదిపట్నం డిఎం గారు ఫోన్ లో మాట్లాడి ఇప్పటినుండి సబర్బన్ బస్సులలో విద్యార్థుల పాసులను అనుమతిస్తామని అన్నారు మెహిదీపట్నం డిఎం గారి ఆదేశం ప్రకారం చేవెళ్ల బస్టాండ్ కంట్రోలర్ గారు రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడంతో ధర్నా విరమించారు విద్యార్థులకు బస్సుల సమస్యలను పరిష్కరించని యెడల రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ నాయకులు శ్రీకాంత్ రమేష్ విగ్నేష్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు