సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి మూడు లక్షలు ఇవ్వాలి.

Published: Friday July 08, 2022
కేటీఆర్ కు విజ్ఞప్తి చేసిన కొలిపాక శ్రీనివాస్
 
బెల్లంపల్లి జూలై 7  ప్రజా పాలన ప్రతినిధి: సొంతంగా స్థలం ఉండి  ఇల్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని కేటీఆర్ చేసిన ప్రకటన, ప్రకటనగానే మిగిలిపోయిందని, వెంటనే సొంత స్థలాలు కలిగి వుండి, ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ద్వారా అందించే మూడు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని బెల్లంపల్లి పట్టణ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్, మంత్రి కేటీఆర్  విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    సొంత స్థలం  ఉండి ఇల్లు లేనీ పేదలకు,  గృహ నిర్మాణం కోసం 3లక్షలు ప్రభుత్వసహాయం అందించాలని,  ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి అయినా డబల్ బెడ్రూమ్ లను అర్హులైన వారికి వెంటనే స్వాధీనం చేయాలని,   ప్రభుత్వభూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని,   ప్రభుత్వఖాళీ  భూములను   పట్టుణ  అభివృద్ధి కై       నిరుపేద లైన   బడుగు  బలహీనవర్గాల వారికీ  మంజూరు చేయాలని, ఆయన డిమాండ్ చేశారు. గతం లో  జి ఓ నంబర్ 58, 59 ద్వారా ఇల్ల పట్టాలకోసం చేసుకున్న దరఖాస్తు దారులకు వెంటనే పట్టాలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.