ఘాట్కేసర్ లో మే డే వేడుకలు ముఖ్యఅతిథిగా ముల్లి పావని

Published: Monday May 02, 2022
మే డే సంధర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి ఈ సంధర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ముందుగా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్మిక లోకం హక్కుగా సాధించిన సెలవు దినం. శ్రమ శక్తిని చాటే నినాదాలతో మేడే శుభాకాంక్షలు పంచుకోండి…  ప్రపంచంలో ఏ మూలనైనా తమ రెక్కల కష్టంతో పనిచేసే వారందరూ కార్మికులే. ప్రతి కార్మికుడి సంక్షేమం ముఖ్యమే. వారికంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. వారికంటూ నిర్ధిష్ట పనివేళలు ఉన్నాయి. రోజూ కష్టపడి విధులు నిర్వహించే శ్రమ జీవుల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, వారు రోజువారీగా చేసే కష్టాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం- మేడేగా పాటిస్తారు. మేడే ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది. ఎంతో మంది శ్రామికులు పోరాటాలు చేసి, రక్తాలను చిందించి కార్మిక హక్కులు సాధించారు. అందులో ముఖ్యమైనది 8 గంటల పని. ఒకప్పుడు పనివేళలు- విశ్రాంటి అని ఉండేదే కాదు. ఈ వెట్టిచాకిరి మేం చేయలేం అంటూ ఎదురించి 'పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప' అని నినదించి కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు చేయడం వలనే ఈరోజు ప్రతి వేతన జీవి 8 గంటల పనిచేసి, మిగతా సమయం విశ్రాంతి పొందుతున్నాడు. ఇది కార్మికులు సాధించిన విజయం. రెక్కల కష్టాన్ని దోచుకోకుండా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాల్సిందే అని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండారు ఆంజనేయులు గౌడ్, కడుపొల్ల మల్లేష్, బేతల నర్సింగ్ రావు, BC సెల్ అధ్యక్షుడు బర్ల హరి శంకర్, యూనియన్ నాయకుడు జయచందర్, కార్మికులు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, కృష్ణ, యాదగిరి, ధర్మేంధర్, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.