ఘనంగా దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు

Published: Tuesday April 04, 2023

మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ లోని అమరవీరుల స్థూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా  నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా  తెలంగాణ బి సి జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్  మాట్లాడుతూ తెలంగాణ కొరకు ఆయన జీవితం త్యాగం చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్ పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ పట్టణ కోశాధికారి సల్లా విజయ్ పట్టణ కార్యదర్శి బద్ది శీను లతోపాటుగా బి సి సీనియర్ నాయకులు కలవల సుధాకర్ రావు రఘుపతిరావు బియ్యాల సత్తయ్య రాచకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.