పెరిగిన నిత్యావసర సరుకులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి..

Published: Wednesday June 09, 2021
పాలేరు జూన్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో దేశంలో పెరిగిన నిత్యావసర సరుకులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిరసనగా యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అంజనీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించడంతో పాటు కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో తీసుకురావాలని కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలనన్నారు. రైతులకు తక్షణమే రుణ మాఫీ చేయాలనితెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు దోసపాటి శేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు షేక్ సుభాన్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు పగిడికత్తుల సుదర్శన్, సోమనబోయిన సాయి నవీన్,  కాసిన వెంకటేష్, అనంత నాగేంద్రబాబు, రాచకొండ అయ్యప్ప,  పిట్టల శీను, తదితరులు పాల్గొన్నారు