మన ఊరు మన బడి వెల్గటూర్ మండలం మొదటి స్థానం నిలవాలి

Published: Friday May 27, 2022

ప్రత్యేక అధికారి నరేష్ కుమార్

వెల్గటూర్, మే 25 (ప్రజాపాలన ప్రతినిధి) వెల్గటూర్ మండలంలో మన ఊరు మన బడి మొదటి విడత 18 పాఠశాలలు ఎంపిక గా సర్పంచులు ఎస్ఎంసి చైర్మన్ లతో  మండల పరిషత్ కార్యాలయంలో   మండల ప్రత్యేక అధికారి నరేష్ కుమార్ జిల్లాలోనే మొదటి స్థానం నిలుపాలనిఆయన అన్నారు. ఎంపిక కాబడిన  ప్రాథమిక పాఠశాలలు10 ఉన్నత పాఠశాలలు6 ప్రాథమికోన్నత పాఠశాలలు 2 పాఠశాలలు చెగ్యాం, ఎండపల్లి, గుల్లకోట, కొండాపూర్, ము త్తూనూర్, వెల్గటూర్, కిషన్ రావు పేట, జగదేవి పేట రాజారామ్ పల్లి కొత్తపేట, గుడిసెల పేట బీ.సీ కాలనీ ఈ గ్రామాల సర్పంచులు ఎస్ఎంసి చైర్మన్ మండల అభివృద్ధి అధికారి సంజీవరావు, విద్యాధికారి భత్తుల భూమయ్య, ఇంజనీరింగ్ అధికారి రాజ్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం లో మన ఊరు మన బడి  కార్యక్రమంలో గుర్తించి వాటిని త్వరితగా పనులు ప్రారంభం చేయాలని ఈ సందర్భంగా అధికారులు నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శేఖర్, కొమ్ము రాంబాబు, అనుమల తిరుపతి, మెరుగు కొమురయ్య, మెతుకు స్వరూప స్వామి, పొన్నం స్వరూప తిరుపతి గౌడ్,  మెరుగు మురళి గౌడ్, కొంగల జగదీశ్వర్రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎస్ఎంసి చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.