కంటి వెలుగుక్యాంపు తనిఖీ చేసిన ఎంపీడీఓ బృందం మధిర రూరల్

Published: Saturday January 21, 2023

జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి శుక్రవారం నాడు మండల పరిధి లో పిహెచ్సి దెందుకూరులో జరుగుతున్న తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాంను రెండవరోజు రైతు వేదిక నందు ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు లు సందర్శించి పిహెచ్సి వైద్యులు డా. పృథ్విని కంటి వెలుగు ప్రత్యేక డాక్టర్ డా. సునీతలను క్యాంపు వివరాలను హాజరైన ప్రజల యెక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు హాజరైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి వారికి అవసరం ఐన కంటి అద్దాలు వెంటనే వారికీ అందించాలి అని వివరించారు. అదే విధంగా ఎంపీవో  టి ఎల్ ఎన్ శాస్త్రి మెయిల్లోకూడ క్యాంపు సందర్శించి టార్గెట్ పూర్తి చేయాలి అని సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు ను ప్రజలు ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎంపీడీవో ఆఫీస్ కి సంప్రదించగలరు వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో పిహెచ్సి కంటి వెలుగు సిబ్బంది హెచ్ఇఒ సనప గోవింద్ పిహెచ్ఎన్ పద్మావతి  హెచ్ఎస్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్ లు భారతి అరుణ రాజేశ్వరి అప్తమాలీక్ అసిస్టెంట్ కొమ్ము ప్రశాంత్ డిఈఓ మల్లికార్జున్, ఆశ కార్యకర్తలు బేగం, సత్యవతి, కళ్యాణి దేవమణి  విజయకుమారి సెక్రటరీ అనూష రెడ్డి డిఈఓ కిరణ్ కుమార్ జిపి సిబ్బంది దోర్నాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.