తూటికుంట్ల గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్

Published: Tuesday October 18, 2022
బోనకల్, అక్టోబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ పర్యవేక్షణలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపు లో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్,థైరాయిడ్, డెంగ్యూ,మలేరియా సంబంధించిన వ్యాధులకు రక్తనమూనాలను స్వీకరించి తగు సూచనలు చేస్తూ మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంపులో 150 మంది పేషెంట్స్ పాల్గొనడం జరిగింది. ఈ క్యాంపు లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోనకల్ డాక్టర్ ప్రదీప్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఏఎన్ఎం నవనీతమ్మా,ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.