*సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి*

Published: Wednesday December 14, 2022

మధిర రూరల్ డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాటూరు పేట ఆయుర్వేదిక్ వైద్యులు పాతూరి శ్రీనివాసరావు  కోరారు. మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెంకటేశ్ సూచనలు మేరకు మండలంలోని సిద్ధిలేని గూడెంలో మంగళవారం పారా మెడికల్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ కు మరియు గర్భిణీలకు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రోజువారిగా షుగర్  బిపి మందులు  వాడే వారికీ వృద్దులకు నెలకు సరిపడా టాబ్లెట్ లు ఇచ్చినారు. ఈ సందర్భంగా డాక్టర్ పాతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ సీజనల్ వ్యాదులు గురించి పరిసరాల పారిశుద్యం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి సంపూర్ణముగా అవగాహన కల్పించారు. అనంతరం ఆయుష్ కరదీపికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధినేనిగూడెం సర్పంచ్ వేమిరెడ్డి పెదనాగిరెడ్డి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న పిహెచ్సి ఆరోగ్య సిబ్బంది భాస్కరరావు మరియమ్మ శోభ రాణి ఆశ కార్యకర్త సుభాషిని తదితరులు పాల్గొన్నారు.