బిజెపి జిల్లా మజ్దూర్ సెల్ కన్వీనర్ గా కాసి రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి

Published: Wednesday July 28, 2021
బాలాపూర్: జూలై 27, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, ఆ పార్టీ ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని జిల్లా మాజీ మజ్దూర్ సెల్ అధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలతోపాటు రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి.. జిల్లా మజ్దూర్ సెల్ కన్వీనర్ గా కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... పార్టీని రంగారెడ్డి జిల్లాలో బలోపేతానికి శాయశక్తుల కృషి చేస్తారని నమ్మకంతో పదవితో పాటు బాధ్యత నిరూపించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..... ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ, ఆ సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టి, పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేశారు. బిజెపి పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు. నాపై నమ్మకం ఉన్న భాజపా నేతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో బిజెపి ప్రతి ఇంట్లో పార్టీ జెండా ఎగరడానికి   కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్స్ భీమ్ రాజ్, సోమేశ్వర్, అమరేందర్ రెడ్డి, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.