సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొ

Published: Saturday February 11, 2023
 బోనకల్, ఫిబ్రవరి 10 ప్రజాపాలన ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సిపిఎం మండల స్థాయి విస్తృత సమావేశం లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతిబిల్లికి పూర్తిస్థాయి మద్దతు తెలిపారని విమర్శించారు. అనేక అంశాల మీద బిజెపి ప్రభుత్వానికి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న మద్దతు తెలిపిన కేసీఆర్ నేడు బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. సిపిఎం బిజెపి మతతత్వ విధానాలకు నిరంతరం వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండదండల తోటే అదాని కోట్లకు పరిగెత్తాడని విమర్శించారు. పార్లమెంటులో అదాని అక్రమాలపై జేపీసీ కి ప్రతిపక్షాలు పట్టుబడితే భయంతోనే బిజెపి ప్రభుత్వం, ప్రధానమంత్రి వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. అదాని అవినీతి, అక్రమాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భాగస్వామ్యం లేకపోతే పార్లమెంటులో జేపీసీ కి ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. దేశ విదేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదానికోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి అన్ని వ్యవస్థలను నాశనం చేస్తూ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బిజెపి ఈ దేశాన్ని మతతత్వ విధానాలతో పరిపాలన చేయాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో పాగ వెయ్యటానికి బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, కానీ సిపిఎం తమ శక్తి మేరకు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటుందన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థ ఏసిడి పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారం మోపాలని ప్రయత్నం చేసిందని, ఆ ప్రయత్నాలను సిపిఎం పోరాటాలతో నిలువరించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తిచేసే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. లౌకిక విలువలకు కట్టుబడుతూ తమ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని, లేనియెడల ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, నాయకులు తుళ్లూరు రమేష్, కందిమళ్ళ రాధ, ఆళ్ల పుల్లమ్మ, గుడ్డూరి ఉమ, కర్లకుంట దేవమణి, ఉమ్మనేని రవి, బోజడ్ల పుల్లారావు, కందికొండ శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, కోట కాటయ్య, గుడ్డూరు వెంకట నరసయ్య, మాదినేని వీరభద్రరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, కొమ్మినేని నాగేశ్వరరావు, మర్రి తిరుపతిరావు, ఏడునూతల లక్ష్మణరావు, కిలారి సురేష్, చిట్టిమోదు నాగేశ్వరరావు, సాధినేని జానకిరామయ్య, తాత వీరయ్య, పెద్దపోలు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.