ఎల్ఐసి వారి సహకారంతో ప్రయాణ ప్రాంగణo నిర్మాణం : ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి

Published: Thursday August 05, 2021

గుమ్మడిదల, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలోని హైదరాబాద్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారి పై ఉన్న నల్లవెల్లి గ్రామ శివారులో నూతన బస్టాండ్ షెడ్ ఎల్ఐసి మెదక్ వారి సహకారంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన సూరారం మహేష్ ఎల్ఐసి ఏజెంట్ నిర్మాణం చేశారు, ఇట్టి కార్యక్రమానికి నల్లవెల్లి సర్పంచ్ దోమడుగు శంకర్, ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ ప్రభుత్వ రంగా సంస్థ ఎల్ఐసి మెదక్ బ్రాంచ్ వారు గ్రామనికి సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరమని, ప్రజల సౌకర్యార్థం బస్టాండు నిర్మించడం అభివృద్ధిలో భాగమేనని ఆయన అన్నారు, అదేవిధంగా గతంలో కొత్తపల్లి గ్రామంలో బస్సు షెడ్ నిర్మాణం చేపట్టిన విషయం గుర్తు చేశారు. ఎల్ఐసి ఆఫీసర్ డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో ఎల్ఐసి పాలసీలు ఉండాలని జీవితం జీవితం అనంతరం నేటి పొదుపు రేపటి గొప్ప శక్తిగా మారుతుందని ప్రతి ఇంటికి ఎల్ఐసి పాలసీలు  చేసి వారి యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మెదక్ ఎల్ఐసి బ్రాంచ్ వారు బస్సు రోడ్డు నిర్మాణం కోసం యాభైవేల రూపాయలు సహాయం అందించడం జరిగిందని కొత్తపల్లి లో గల ఎల్ఐసి ఏజెంట్ సూరారం మహేష్ మరో 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి లక్షా ఇరవై వేల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సూరారం మహేష్ ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమానికి నాగిరెడ్డి గూడెం సర్పంచ్ హనుమంత్ రెడ్డి, నల్లవెల్లి ఉప సర్పంచ్ కొరివి శంకర్, వార్డు సభ్యులు రామా గౌడ్, సదానంద, భవాని, జయమ్మ, శంకర్, ఫయాజ్ షరీఫ్, శివ కుమార్, సత్యమ్మ, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.