పరిగిలో మన ఊరు మన పోరును విజయవంతం చేద్దాం

Published: Friday February 25, 2022
డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : ఈనెల 26న పరిగి లో జరిగే మన ఊరు మన పోరును విజయవంతం చేద్దామని డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పార్లమెంట్ ఇంచార్జ్ వేముల నరేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో వికారాబాద్ జిల్లా వెనకబాటుకు గురైన తీరును ఎండగట్టేందుకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు వికారాబాద్ జిల్లాకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో అంతటి ప్రాధాన్యత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉత్తర తెలంగాణ అభివృద్ధి పై దృష్టి పెట్టినట్లుగా దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టడం లేదని దెప్పిపొడిచారు. ప్రాణహిత-చేవెళ్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి ఉంటే వికారాబాద్ జిల్లా సాగునీటికి కటకటలాడేది కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన జోన్ మార్పిడికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేసిందని గుర్తు చేశారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో వికారాబాద్ జిల్లా వెనుకబడిందని విమర్శించారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టేందుకు పరిగిలో ఏర్పాటు చేసిన మన ఊరు మన పోరు కార్యక్రమానికి టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ ఆర్ ఎన్నికలు దగ్గర పడ్డప్పుడే నియోజకవర్గాలను తిరుగుతాడని విమర్శించారు. జిల్లాకు మెడికల్ కళాశాల ఔషధ నగరి మంజూరు చేస్తానని బీరాలు పలికిన మాట తప్పని మడమ తిప్పని మహామనిషి హామీ ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను గాలికి వదిలి బంగారు భారతదేశానిగా మారుస్తానని గాలి మాటలు చెబుతున్నారని తెలిపారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని దెప్పిపొడిచారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ రమేష్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కమాల్ రెడ్డి బ్లాక్ అధ్యక్షుడు అనంత రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ చాపల రఘుపతి రెడ్డి ఎర్రవల్లి జాఫర్ కల్ఖోడ నర్సింలు రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ జైదుపల్లి మురళి సతీష్ రెడ్డి ఇ రెడ్యానాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.