లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Published: Thursday December 16, 2021
బెల్లంపల్లి, డిసెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి: లయన్స్ క్లబ్ 320జి జిల్లా గవర్నర్ నాగుల సంతోష్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాతబస్టాండ్ వద్ద గల ఆక్స్ఫర్డ్ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని వులన్ బ్లాంకెట్లను పిల్లలకు మాస్క్ లను పంపిణీ చేశారని లైన్స్ క్లబ్ అధ్యక్షులు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వారు చేసిన సేవలకు వారికి లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సింగరేణి వారు బ్లాంకెట్స్ మరియు పిల్లలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, అధ్యక్షులు నాగేంద్ర, కార్యదర్శి సదాశివ, కోశాధికారి వంగల ఉమారాని, జిల్లా చైర్మన్ చక్రపాణి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.