చెరువులను కాపాడాలి*

Published: Friday January 20, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 19, ప్రజాపాలన : జిల్లాలో కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని ఇరిగేషన్ డి ఈ కార్యాలయ సిబ్బందికి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిప్పకుర్తి శ్రీనివాస్  మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భూముల విలువ పెరగడం వలన తో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు   విచ్చలవిడిగా శిఖం భూములు కబ్జాలు చేస్తూ వాటిలో అక్రమ వెంచర్లు వేసి ప్రభుత్వ ఆశయానికి ఆదాయానికి గండి కొట్టి అమాయక ప్రజల నుండి పెద్ద మొత్తంలో వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు, నస్పూరు మంచిర్యాల మండలాల్లోని కొత్త చెరువు సాయి కుంట చెరువుల్లో ఎఫ్ టి ఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నందు మట్టిని పోసి దానిని వెంచర్లుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని నస్పూర్ మంచిర్యాల మండలాల తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేసిన  పై చెరువులలో పనులను నిలుపుదల చేయలేదని అది ఇరిగేషన్ శాఖ వారి బాధ్యతని చెబుతూ నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెరువు శిఖలలో జరుగుతున్న అక్రమ పనులను వెంటనే నిలుపుదల చేసి సాయి కుంట చెరువు నందుగల మత్తడిని ధ్వంసం చేసిన కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని చెరువులను కాపాడాలని ఐక్య విద్యార్థి సంఘాల గా డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
 జాగిరి రాజేష్, రేగుంట క్రాంతి కుమార్, బచ్చలి ప్రవీణ్ కుమార్, పురేళ్ళ నితీష్ తదితరులు పాల్గొన్నారు.