సారోపాఖ్యానం బై బంగారు వి బి ఆచార్యులు

Published: Wednesday June 15, 2022

*సారో పాఖ్యానం* 

 

తాగొద్దనే నాయాళ్ళు

తాగుడంగళ్ళనెడతారు

తాగుడంగళ్ళకెడతారు

అక్కడ లైన్లో నిలబెట్టిన లాఠీ 

తాగి బండి నూకితే సాలు

నోటికాడ మిసనెట్టీసి

ఉఫ్...ఉఫ్ మని ఊదమంతది 

కూ... కూ... అనడమే తడుం

బిల్లు సేతిలో పెట్టి

పైసలు కట్టమని యాగీసేత్తంది

లేదంటే బొక్కలో తోత్తంది... 

 

పైసల్లేవు బాబూ 

నన్నొగ్గీమంటే 

బండి నొగ్గేసి

కోర్టుకొచ్చి ఫైను కట్టి

తీసుకెల్లు అంతారు

కాకుంటే లాఠీ ఇరగతంతారు...

ఈ మరమమేందో పెరుమాల్ల కెరుక!

నాలాంటి నాయాల్లకి

తాగుడే ఎరుక...

 

నా సొమ్ముతో నేతాగితే తప్పేటి సారో అంతే...

ఓసోసి లాపాయింటు 

బొక్కలో తోత్తానొరేయ్ అంతారు... 

తాగి బండి తోలితే

గుద్ది సంపుతానంత

కూసేపు అదీ సత్తెమే ననుకో

పోతే వొంటి పేనమే కదా పోద్ది...

మరి  తప్పుడు సన్నాసులు

పైసలిచ్చి, తాగుడోసి మరీ ఓటు గుద్దిచ్చుకున్నప్పుడు

ఎన్ని బతుకులు ఏమారతాయో 

ఎవుడు సెబుతాడు? 

 

అసలు తాగుడుపోయించి

ఓట్లు గుంజుకొనే ఎదవలననాలా

తాగి ఓట్లేసిన సన్నాసులననాలా

తాగుడు మీద బతుకుతున్న

ప్రభుత్వాలననాలా

సిగ్గులేని నాయకులననాలా

 

నాలాటోడు 

ఎవుణ్ణనేట్నాబం

గొప్పోడి మరమాలు

నాకేటి తెల్సు...

కూసింత సుక్కేసి తొంగుంతే

కోటీశుడే సాలడు నాకు…

 

***


 

బంగారు వి బి ఆచార్యులు

98495 79569.

 

—------------------------------------------

 

టు

ది ఎడిటర్

ప్రజాపాలన

 

ఆర్యా

 

మీకు పంపిన "సారోపాఖ్యానం" కవిత నా స్వీయ రచన. దేనికి అనుకరణ గాని, అనుసరణ గాని, అనువాదం గాని కాదు. ప్రచురణార్హమైన ప్రచురించగలరు.

 

బంగారు వి బి ఆచార్యులు

1-113/ 17, అరవిందనగర్, 

నాగారం, హైదరాబాద్ - 500 083

 

Mob: 98495 79569