ఫోన్ చెయ్ సమస్యను పరిష్కరించుకో

Published: Tuesday December 20, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో భాగంగా ఫోన్ ద్వారా సమస్యలు తెలపితే పరిష్కరిస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 14 ఫిర్యాదులు వచ్చినవి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్ తో సమస్యను పరిష్కరిస్తున్న చైర్ పర్సన్ కు ధన్యవాదాలు అని ప్రజలు తెలిపారని వివరించారు. గతంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఆఫీసుకు సెలవు పెట్టి మున్సిపల్ కార్యాలయం ముందు పడిగాపులు కాయాల్సి వచ్చేదని నష్టం చేశారు. ప్రజల కష్టాల కడలని ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కరిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ కు అభివందనాలని ప్రజలు తెలిపారు. డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను నేను మా మున్సిపల్ సిబ్బందితో కలిసి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రాజీవ్ నగర్ కాలనీ స్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదని, ఎన్జీవోస్ కాలనీలో డ్రైనేజ్ సమస్య, మిషన్ భగీరథ వాటర్ సమస్య, వివిధ వార్డులలో స్ట్రీట్ లైట్లు, దోమల మందు, గడ్డి మందు పిచికారి చేయడం లాంటి సమస్యలను చైర్ పర్సన్ ప్రజలు ఫిర్యాదు చేశారన్నారు. సానుకూల దృక్పథంతో ఆలోచించిన చైర్ పర్సన్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిపిఓ శ్రీధర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మొహీనుద్దీన్, ఏఈ రాజ్ కుమార్, మెప్మా వెంకట్, టిపిఎస్ వేణు, ఆర్వో శివ, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్, యేసు, యాదయ్య, శ్రీను, రాజు, గోపాల్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.