శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్

Published: Wednesday November 17, 2021
మేడిపల్లి, నవంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ పద్మావతి దంపతుల వివాహ దినోత్సవం మరియు మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ ల జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు.