కరోనా విపత్తులోనూ ఆగని సంక్షేమ పధకాలు. పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి.

Published: Tuesday August 31, 2021
పాలేరు ఆగస్ట్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పధకాలు కొనసాగిస్తుందని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద సోమవారం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ 35 మందికి, 9 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్వేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నిరుపేదలకు వరంగా ఈ ప్రభుత్వం మారిందని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తుగా ప్రజలను అప్రమతం చేయాలని అధికారులను ఆదేశించారు. గువ్వలగూడెం. రాయగూడెం లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ బచ్చలకూరి శ్రీనివాసరావు ను కోరట్లగూడెం లో ఆయన నివాసం లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, ఎంపీపీ వజ్జా రమ్య, తదితరులు పాల్గొన్నారు