ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

Published: Tuesday December 07, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, పట్టణ కార్యదర్శి సలబద్రి రవీందర్, ఎ ఐ వై ఎఫ్ ఐ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, బందెల బిక్షపతి, శివరాత్రి లక్ష్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది