చంద్రన్న 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టిడిపి కార్యకర్తలు

Published: Thursday April 21, 2022
అన్ని దానాలకన్నా, అన్నదానమే మిన్న మధిర ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడుపేదవాడికి పట్టెడు అన్నం పెట్టే గుణం కలిగిన మా అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా, మధిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగుయువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలును రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రి మరియు సేవసదనంలో పండ్లు పంపిణీ, అనంతరం టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు సహకారంతో తహసీల్దార్ కార్యాలయం నందు చలివేంద్రం దెగ్గర మహా అన్నదానం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.వాసిరెడ్డి రామనాధం గారు, మధిర మండల అధ్యక్షులు మార్నిడి పుల్లారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి మేడేపెళ్లి రాణి, తెలుగు మహిళ మన్నెపల్లి రత్నకుమారి, పగిడిపల్లి విజయమ్మ, రాష్ట్ర యువజన కార్యదర్శి మైనీడీ జగన్మోహన్ రావు, మేడ వెంకటేశ్వరరావు, గడ్డం రమేష్, దేవభక్తుని వెంకట్, దుగ్గినేని రాజశేఖర్, గడ్డం మల్లికార్జునరావు, వేల్పుల కొండ, రామ్మోహన్ రావు, నియోజకవర్గ తెలుగు యువత యలమంచి శివ చౌదరి, అనుమోలు సతీష్, వడ్లమూడి సాయి, పోతినేని సాయి, మట్టూరి దుర్గ, గుమ్మ ప్రశాంత్, తాళ్లూరి శ్రీను మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.