ఘనంగా బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..

Published: Thursday April 06, 2023
ఖమ్మం, ఏప్రిల్ 5 (ప్రజా పాలన న్యూస్):
 దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఖమ్మంలోని తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కళాశాల ఇంచార్జ్ జిల్లా సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సేవలు అందించారని గుర్తుచేశారు. యువకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ రూప, నిరుద్యోగులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*